చెప్పేది విను అంతే!: బిజెపి ఎంపి కీర్తిని కసిరిన నితీష్

ముఖ్యమంత్రి తీరు పైన భాగస్వామ్య పక్షమైన బిజెపి నేతలు తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధికి ఇచ్చే గౌరవమిదేనా అంటూ మండిపడ్డారు. నితీష్ కుమార్ ఇటీవల చేపట్టిన సేవా యాత్రలో భాగంగా ఆదివారం దర్బంగలో సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఆ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కీర్తి ఆజాద్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో తనకు మాట్లాడే అవకాశమివ్వాలని నితీష్ కుమార్‌ను కీర్తి ఆజాద్ కోరారు. ఆయన కోరికని తిరస్కరించాడు. అంతేకాకుండా.. మాట్లాడవద్దని, నేను చెప్పేది వినాలని కసురుకున్నారు.
కీర్తి ఆజాద్ మాజీ ముఖ్యమంత్రి భగవత్ ఝా ఆజాద్ తనయుడు. అలాంటి వ్యక్తికే గౌరవం లేకపోతే ఇతర నేతల పరిస్థితి ఏమిటని బిజెపి నేతలు ఆవేదన చెందుతున్నారు. తన పట్ల నితీష్ ప్రవర్తనపై మండిపడ్డ కీర్తి ఆజాద్... ముఖ్యమంత్రి సేవా యాత్రను హెలికాప్టర్ యాత్ర అంటూ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications