చెల్లెమ్మా అని జైలుకు పంపిస్తున్నాడు: వైయస్‌పై ఆనం

మేనత్తను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుపాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది ఇద్దరి మంత్రులతో ఆగేలా లేదని, మరికొంతమంది ఉసురును ఆ కుటుంబం పోసుకునేలా ఉందన్నారు. మంత్రులను కళంకితులంటే కడుపు మండుతోందన్నారు.
వారిని బలిపశువులు అనడం మంచిదని అభిప్రాయపడ్డారు. వారు గునపాలు, కత్తులు అమ్మిన వ్యాపారులు కాదని, వాటిని కొని హత్యలు చేసిన వారే నేరస్థులన్నారు. ఏ పదవి లేకుండా లక్ష కోట్లు జగన్ అసలు ఎలా సంపాదించారో విజయమ్మ చెప్పాలని ప్రశ్నించారు.
తన కూతురు షర్మిలకు కట్నం కింద మూడు మండలాల బయ్యారం గనులను రాసిస్తే తప్పు లేదట అని మండిపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం బలవుతున్న మంత్రులు, ఐఏఎస్ అధికారులకు తల్లులు లేరా? వారికి బాధ ఉండదా? అని ఆనం వివేకానంద రెడ్డి దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications