జైలు నుండి రాజకీయాలా?: బాబు, ఐపిఎల్‌పై ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నగదు బదలీ పథకం నకిలీ బదిలీగా మారిందని ఎద్దేవా చేశారు. ఇతర దేశాల్లోని నల్ల ధనాన్ని వెలికి తీస్తే సామాన్యుల జీవితాలు ఎంతో మెరుగుపడుతాయన్నారు. ప్రస్తుతం జైలులో కూర్చొని రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. జైలు నుండి సెటిల్మెంట్లు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఐపిఎల్ కూడా అవినీతిమయంగా మారటం బాధాకరమన్నారు. లావాదేవీలు అన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చూడాలన్నారు.
దేశంలో 75 లక్షల కోట్ల నల్లధనం ఉందని ఓ అంచనా ఉందన్నారు. నల్లధనం క్రీడలను శాసిస్తున్నాయన్నారు. క్రీడల్లోకి కూడా నల్ల ధనాన్ని ప్రవేశ పెట్టారని ఆవేదన చెందారు. దేశ కరెన్సీలో 49 శాతం రూ.500 నోట్లు, 33 శాతం రూ.1000 నోట్లు ఉన్నాయని వాటిని రద్దు చేయాలన్నారు. నల్లధనంతో వ్యవస్థలు కుప్పకూలాయన్నారు. అవినీతిరహిత భారత్ ఏర్పడేదాకా టిడిపి పోరాటం చేస్తుందన్నారు.
కడియంకు చిత్తశుద్ధి ఉంటే పోటీ చేయొద్దు: ఎర్రబెల్లి
తెలంగాణపై కడియం శ్రీహరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వచ్చే ఎన్నికలలో పోటీ చేయకుండా ఉంటారా? అని తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ప్రశ్నించారు. తెలంగాణపై ఇదివరకే మహానాడులో తీర్మానం చేశామని మరోసారి కుదరదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications