వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌దే తప్పు, మంత్రులు అమాయకులు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌దే తప్పు అని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో చిక్కుకున్న మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు అమాయకులని ఆయన అన్నారు. నిబంధనల మేరకే వారు జీవోలు జారీ చేశారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తొందరపాటు వల్ల సిబిఐ ఆ ఇద్దరు మంత్రులను నిందితులుగా చేర్చి ఉంటుందని ఆయన అన్నారు.

సున్నంరాయి గనుల కేటాయింపుల్లో గానీ, భూమి కేటాయింపులో గానీ అక్రమాలు జరగలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కుమారుడిగా వైయస్ జగన్ తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకున్నారని, పెట్టుబడులు పెట్టించుకున్నా డబ్బులు దండుకున్నా తప్పేనని ఆయన అన్నారు. ఓ ముఖ్యమంత్రి కుమారుడిగా అలా చేయడం తప్పు అవుతుందని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులతో మంత్రులకు సంబంధం లేదని ఆయన అన్నారు.

ఇద్దరు మంత్రులు జారీ చేసిన జీవోలను తాను అధ్యయనం చేశానని, ఆ జీవోల్లో ఏ విధమైన తప్పులు లేవని ఆయన అన్నారు. సున్నంరాయి గనులను ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదలాయిస్తే మంత్రి పాత్ర ఏం ఉంటుందని ఆయన అడిగారు. గనుల బదలాయింపుల్లో ఏ విధమైన తప్పు జరగలేదని ఆయన అన్నారు. ఏ ముఖ్యమంత్రి కుమారుడు అడిగినా పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడం సాధారణమని ఆయన అన్నారు. సాధారణ జీవోలు చూసి అక్రమాలు జరిగాయని అనడం సరి కాదని ఆయన అన్నారు.

తాము జారీ చేసిన జీవోల కారణంగా సబితా ఇంద్రారెడ్డి గానీ ధర్మాన ప్రసాదరావు గానీ ప్రయోజనం పొందలేదని, తమ పిల్లల సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని వారు పారిశ్రామికవేత్తలను అడగలేదని ఆయన అన్నారు. మంత్రులపై ఆరోపణలు చేయడం, వారిని కళంకిత మంత్రులని అనడం బాధాకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాల్లో తప్పున్నా లేకపోయినా ప్రభుత్వాధినేత కుమారుడిగా పెట్టుబడులు రాబట్టడం జగన్ చేసిన తప్పేనని ఆయన అన్నారు. జగన్ సంస్థల్లో 76 మంది పెట్టుబడులు పెట్టారని ఆయన చెప్పారు.

ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి జారీ చేసిన జీవోల వంటి జీవోలు వందల సంఖ్యలో జారీ అయ్యాయని ఆయన అన్నారు. మంత్రులు ఈ విషయంలో ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన అన్నారు. సమయం లేకపోవడం వల్ల, తొందరపాటు వల్ల, ఒత్తిడి వల్ల సిబిఐ ఆ ఇద్దరు మంత్రులను నిందితులుగా చేర్చి ఉంటుందని ఆయన అన్నారు. తొందరగా చార్జిషీట్లు దాఖలు చేసే ఒత్తిడిలో కూడా సిబిఐ పొరపాటు పడి ఉంటుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు డబ్బులు దండుకుంటే మంత్రులకు ఏం సంబంధం ఉంటుందని ఆయన అడిగారు.

మంత్రుల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రేనని, తాము సూచనలూ సలహాలు మాత్రమే చేయగలమని ఆయన అన్నారు. తప్పు చేయకున్నా మంత్రులు ప్రజా కోర్టులో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. మంత్రులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం బాధాకరమని లగడపాటి అన్నారు. మంత్రులు జీవోలు ఇస్తారని, తెర వెనక ఏం జరిగిందనేది మంత్రులకు ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal said that YSR Congress president YS jagan resorted to unlawful activities, the ministers Sabitha Indra Reddy and Dharmana Prasad Rao are innocent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X