తరిమేయాలి: జగన్‌పై పేలిన ఆనం, డిప్యూటీ అ'సమ్మతి'

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డిని రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన కాంగ్రెసు పార్టీ పైనే జగన్ విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకున్నారన్నారు. అధికారం కోసం అర్రులు చాస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని రాష్ట్రం నుండి, దేశం నుండి తరిమేయాలన్నారు. ఆర్థిక ఉగ్రవాది నడ్డి విరిచేందుకు కాంగ్రెసు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
పార్టీని వదిలి వెళ్తే పట్టించుకోవద్దు: మహీధర్ రెడ్డి
పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి మహీధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెసుకు మాత్రమే సొంత పత్రిక, ఛానళ్లు లేవన్నారు. కొన్ని పార్టీలో సొంత పత్రిక, ఛానళ్లు పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆగస్టు రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మొదటి వారంలో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
అనుమతిస్తే యాత్ర: విహెచ్
కాంగ్రెసు పార్టీ సంక్షేమ పథకాలకు కార్యకర్తలో అసలైన ప్రచారకులు అని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు అన్నారు. రాజీనామా చేసిన మంత్రులు తమ సచ్ఛీలతను నిరూపించుకుంటే పార్టీ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. అధిష్టానం అనుమతిస్తే పార్టీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచార యాత్ర నిర్వహిస్తానన్నారు.
పథకాలే అంటే నమ్మను: దామోదర
పథకాలే విజయాన్ని అందిస్తాయంటే తాను అంగీకరించనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, పథకాల ద్వారా కాంగ్రెసు తిరిగి అధికారంలోకి వస్తుందని నేతలందరు చెప్పగా దామోదర మాత్రం ఇలా మాట్లాడటం ద్వారా తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారనే చెప్పవచ్చు.
పథకాలే గెలిపిస్తాయంటే తాను నమ్మనన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాది అన్నారు. నేను అంటే గెలువమని.. మనం అంటేనే గెలుస్తామన్నారు. తన జాతి ఆత్మఘోష తనకు తెలుసునని చెప్పారు. ఇప్పటి వరకు దళితులకు చేసింది 30 శాతమే అన్నారు. దళితుల నాయకత్వంలోనే మిగతాది సాధ్యమన్నారు. కాగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా దామోదర రాజనర్సింహ వేదిక దిగి వెళ్లారు.












Click it and Unblock the Notifications