టిడిపి ఆఫీసుకు దేవినేని ఉమ తమ్ముడి తాళం

చంద్రశేఖర్ కార్యాలయానికి తాళం వేసినప్పుడు దేవినేని ఉమ స్థానికంగా లేరు. ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ చంద్రశేఖర్ ఆ చర్యకు దిగారు. తన సోదరుడి ఆధిపత్య ధోరణికి నిరసనగా తాళం వేసినట్లు చంద్రశేఖర్ చెప్పారు .
తమ అనుమతి లేకుండా తమ భవనంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెట్టే హక్కు దేవినేని ఉమకు లేదని చంద్రశేఖర్ అన్నారు. ఉమ్మడి ఆస్తుల నుంచి లభిస్తున్న ఆదాయంలో తమకు వాటా ఇవ్వడం లేదని ఆయన దేవినేని ఉమపై ఆరోపణలు చేశారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఉమామహేశ్వర రావు అందుబాటులో లేరని స్థానిక మీడియా రాసింది.
కాగా, చంద్రశేఖర్ గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications