దారుణం: మధ్యప్రదేశ్‌లో రేప్‌లపై నటి నగ్మా ఫైర్
భోపాల్: దేశంలోనే అత్యధికంగా మహిళల అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లో జరుగుతున్నాయని, నేరాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని సినీ నటి, ఎఐసిసి సభ్యురాలు నగ్మా విమర్శించారు. మధ్యప్రదేశ్‌లో 204 నుంచి 2012 అక్టోబర్ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 27,104 అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు జరిగాయని, సగటున ప్రతి రోజు 9 మందిపై అత్యాచారం జరుగుతోందని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
నిరుడు అక్టోబర్ నుంచి అత్యాచారాలు మరింతగా పెరిగాయని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలు ఏవీ అమలు కావడం లేదని, అవి కాగితాలకు మాత్రమే పరిమితయ్యాయని ఆమె విమర్శించారు.

మనుషుల అక్రమ తరలింపు కూడా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి ఈ అక్రమ వ్యవహారం ఎక్కువగా సాగుతోందని, 2004 నుంచి 2012 అక్టోబర్ వరకు 37 వేల మందికిపైగా అమ్మాయిలను తరలించారని ఆమె చెప్పారు. అయినా ప్రభుత్వం దాన్ని తీవ్రంగా పరిగణించడం లేదని ఆమె అన్నారు.
పేదలకు ఉద్దేశించిన పోషకాహారానికి బడ్జెట్ పెంచినప్పటికీ ఆ డబ్బులన్నీ పాలక బిజెపి పార్టీకి సన్నిహితులైన కాంట్రాక్టర్ల చేతుల్లో వెళ్తున్నాయని నగ్మా అన్నారు.












Click it and Unblock the Notifications