వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్: భారత ఎంబసీ వద్ద వరుస బాంబు పేలుళ్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Bomb Blasts near Indian embassy
కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద ఈ పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. అఫ్గనిస్తాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ భారత పర్యటన నేపథ్యంలో ఈ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మే 20 నుంచి 22వ తేదీ వరకు కర్జాయ్ ఢిల్లీలో ఉన్నారు.

2009 అక్టోబర్‌లో కారులో వచ్చి ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో 12 మంది మరణించగా, 83 మంది గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఐటిబిపి జవాన్లు కూడా ఉన్నారు. ఆత్మాహుతి కారు బాంబు పేలుడు పాల్పడింది తామేనని, భారత రాయబార కార్యాలయం తమ లక్ష్యమని అప్పట్లో తాలిబాన్లు ప్రకటించారు.

శుక్రవారం పేలుళ్లు సంభవించిన తర్వాత భారీ కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే, మరణాలు సంభవించినట్లు సమాచారం. లేదు.

English summary

 A series of blasts were heard in the centre of the Afghan capital, Kabul today at about 4 pm local time (11:30 GMT) in the downtown district of Borj-e Sharahah, a Kabul police spokesman said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X