వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువ హవా: ప్రీ‌ప్లాన్డ్‌గా నారా లోకేష్: జూ.ఎన్టీఆర్ వెలితి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nara Lokesh - Jr Ntr
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని పరిసరాల్లోని గండిపేటలో జరుగుతున్న మహానాడు వేడుకలో సోమవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు సీనియర్ నేతల తనయులు కూడా ఈ వేడుకలో ఆకర్షణగా నిలిచారు.

పరిటాల శ్రీరామ్, రామ్మోహన నాయుడు, చింతకాయల విజయ్, దేవినేని చంద్రశేఖర్, రితేష్ రాథోడ్, కరణం వెంకటేష్, సిద్దార్థ రెడ్డి, వీరేంద్ర గౌడ్, రాజారామ్ యాదవ్ వంటి యువకులు మహానాడులో పాల్గొన్నారు. యువ నేతలంతా ఒకే గ్యాలరీలో హంగామా చేశారు.

ఇదంతా నారా లోకేష్ ప్రయత్నంలో భాగమే అంటున్నారు. ఇటీవల లోకేష్ పలు జిల్లాల్లో తిరిగి పార్టీ నేతలను కలుసుకున్నారు. ఆయన ప్రధానంగా యువత పైన దృష్టి సారించారు. టిడిపి నియోజకవర్గం భేటీలు, మినీ మహానాడులో పాల్గొంటూనే మరోవైపు యువతతో సంప్రదింపులు జరిపారు. వచ్చే ఎన్నికలలో టిడిపిలో యువతనే కీలకమని వారిని ప్రోత్సహించారట.

నేటి మహానాడుకు భారీగా యువనేతలు వచ్చేలా వెన్నుతట్టారంటున్నారు. దీంతో నేటి మహానాడులో లోకేష్ సహా యువతతో హవా అయింది. మహానాడులోను యువత అన్నింటిలో తానై దూసుకుపోతున్నాడు. సీనియర్లను ఆహ్వానించడం, పలువురు సీనియర్ నేతల దగ్గరకు వెళ్లి విచారించడం చేస్తున్నాడు.

ఓ వైపు నారా లోకేష్‌తో పాటు యువ హవా మహానాడులో కొనసాగుతుండగానే జూనియర్ ఎన్టీఆర్ లోటు కూడా కనిపిస్తోందని అంటున్నారు. గతంలో జూనియర్ ఒక మహానాడు మినహా పాల్గొనకపోవచ్చు. కుటుంబ విభేదాల వార్తల నేపథ్యంలో ఆయన హాజరవుతారని అందరూ భావించారు. కానీ అతను సినిమా షూటింగ్ వల్ల రాలేదని చెబుతున్నారు.

కుటుంబ విభేదాలకు తోడు జూనియర్ నేతల హవా సాగుతున్న ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ లేకపోవడం కొంతమంది జూనియర్ అభిమానులు వెలితిగా భావించారట. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ వచ్చినప్పటికీ అన్యమనస్కంగానే కనిపించారు. పార్టీ కండువా వద్దన్న అతను ముభావంగా ఉన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu's son Nara Lokesh is special attraction in Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X