వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు లైఫ్: పేపర్ బైండింగ్ జాబ్‌లో సంజయ్ దత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sanjay Dutt
ముంబై: పూణేలోని యెరవాడ జైలులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పేపర్ ఫైళ్ల తయారీ, పేపర్ బైండింగ్ వర్క్ అప్పగించినట్లు సమాచారం. 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ 42 నెలల జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉన్న విషయం తెలిసిందే. భద్రత కారణాల రీత్యా సంజయ్ దత్‌ను ఇతర ఖైదీలతో కలవకుండా జైలు అధికారులు చూస్తున్నట్లు సమాచారం.

ఇతర ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా జైలులోనే కూర్చుని చేసేందుకు వీలుగా సంజయ్ దత్‌కు పేపర్ ఫైళ్ల తయారీ, పేపర్ బైండింగ్ వర్క్‌లను అధికారులు అప్పగించినట్లు చెబుతున్నారు. మరింత వెసులుబాటు కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సంజయ్ దత్ టాడా కోర్టు ముందు లొంగిపోయారు. ఆయనను ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతి రహస్యంగా యెరవాడ జైలుకు తరలించారు.

గతంలో జైలులో ఉన్నప్పుడు సంజయ్ దత్‌కు నిట్టింగ్ యార్న్ కేన్ చైర్ల తయారీ పనిని అధికారులు అప్పగించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత సంజయ్ దత్ తయారు చేసిన కుర్చీని ఒకదాన్ని వేలం వేశారు. పని పూర్తి చేసిన తర్వాత ఖైదీలకు 25 నుంచి 40 రూపాయల వరకు చెల్లిస్తారు. మంచి పనికి, మంచి ప్రవర్తనకు జైలు జీవితంలో కొంత ఊరట కూడా ఇస్తారు.

ఖైదీలు ఫర్నీచర్, క్యాండిల్ స్టాండులు, దైనందిన జీవితంలో వాడడానికి వీలయ్యే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తారు.

English summary
Bollywood actor Sanjay Dutt, who was convicted in the 1993 blasts case and is presently lodged at Yerawada jail, will spend the 42 months of his sentence making paper files and doing paper-binding work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X