వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఛత్తీస్‌గడ్ ఊచకోత వెనక కటికం సుదర్శన్, వేణు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Chhattisgarh attack: Katakam Sudershan allegedly behind the massacre
న్యూఢిల్లీ: చత్తీస్‌గడ్ ఊచకోత వెనక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు టాప్ నక్సల్స్ ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వర్గాలు ఈ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. చత్తీస్‌గడ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో సల్వజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, చత్తీస్‌గడ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్‌తో పాటు 28 మంది మరణించారు.

గత కొద్ది నెలలుగా మావోయిస్టులకు చత్తీస్‌గడ్‌లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ప్రతీకారం తీసుకునేందుకు మావోయిస్టు పార్టీ కటికం సుదర్శన్‌ను నియమించినట్లు వార్తలు వచ్చాయి. చత్తీస్‌గడ్ ఊచకోత సూత్రధారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటికం సుదర్శన్ అని కేంద్ర హోం మంత్రిత్వ వర్గాలు భావిస్తున్నాయి.

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఈ ఆపరేషన్‌లో ప్రధాన భూమిక పోషించినట్లు అనుమానిస్తున్నారు. మహేంద్ర కర్మను మట్టుబెట్టేందుకు సుకుమా జిల్లాలో అర డజను మావోయిస్టు మిలటరీ వింగ్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీలు మోహరించినట్లు చెబుతున్నారు. మెరుపుదాడికి 48 గంటలలోపే పూర్తిగా ప్రణాళిక రచించుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ప్రణాళిక రూపకల్పనలో తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అలియాస్ చేతను, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను కూడా పాలు పంచుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందినవారే. మల్లోజుల వేణుగోపాల్ రావు ప్రభుత్వ బలగాల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ సోదరుడు. వీరిద్దరు కూడా దాడిలో స్వయంగా పాల్గొన్నట్లు చెబుతున్నారు.

English summary

 According to top Home Ministry sources, Maoists had suffered several setbacks in the past few months and wanted to retaliate. They appointed central committee member Katakam Sudershan, who then planned the lethal attack on the Congress' convoy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X