చుక్కెదురు: శ్రీశాంత్, చండిల పోలీసు కస్టడీకి కోర్టు నో

మరో రెండు రోజుల పాటు శ్రీశాంత్, చండిలలను తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, కోర్టుకు అందుకు అంగీకరించలేదు. ఈ నెల 16వ తేదీన అరెస్టయిన ఈ ఇద్దరు క్రికెటర్లు కూడా అప్పటి నుంచి పోలీసు కస్టడీలోనే ఉన్నారు మరో ఇద్దరు బుకీలను కూడా కోర్టు జూన్ 4వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
విదేశాల్లోని అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న బుకీలతో ఏర్పాటు చేసుకుని కనీసం మూడు ఐపియల్ మ్యాచులను ఫిక్స్ చేశారనే ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఈ నెల 16వ తేదీన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేశారు.
ముందే నిర్ణయించిన ప్రకారం పరుగులు ఇవ్వడానికి 60 లక్షలకు ఆ ముగ్గురు క్రికెటర్లు కూడా బుకీలతో ఒప్పందం కుదుర్చుకుని స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications