వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పినా బుద్ది రాలేదు: హరీష్, బాబు మారుపేర్లంటూ...

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి ఎంత చెప్పినా బుద్ధి రాలేదని తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు బుధవారం మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ మహానాడులో తెలంగాణపై తీర్మానం ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరికి ఇదే మంచి నిదర్శనమన్నారు.

తెలంగాణపై తీర్మానం పెట్టవలసింది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు కాదని, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారన్నారు. టిడిపి తెలంగాణపై తీర్మానం పెట్టవలసింది తమ పార్టీ కోసం కాదని తెలంగాణ ప్రజల కోసమని గుర్తుంచుకోవాలన్నారు.

మాట తప్పడం, మడమ తిప్పడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మారుపేర్లు అని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోందన్నారు. చంద్రబాబు అండ లేకుంటే ఈ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేదన్నారు.

కాగా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడులో తెలంగాణపై స్పందించిన విషయం తెలిసిందే. తాము 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని, గతేడాది ఆఖర్లో జరిగిన అఖిల పక్ష సమావేశంలోను 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పామని అన్నారు. అయితే 2008 తీర్మానం మాట కాకుండా తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని తెరాస డిమాండ్ చేస్తోంది.

English summary
TRS siddipet MLA Harish Rao has blamed that TDP is not learning lesson till today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X