వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ. ఎన్టీఆర్‌కు తారకరత్న కౌంటర్ ఎందుకిచ్చారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jr Ntr -Taraka Ratna
హైదరాబాద్: నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ప్రకటనకు మరో నందమూరి హీరో తారకరత్న కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తారకరత్న జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యతిరేకించడంలోని రహస్యమేమిటనే విషయంపై చర్చ సాగుతోంది. నందమూరి, నారా కుటుంబాల మధ్య విభేదాలతో పాటు నందమూరి కుటుంబంలో కూడా విభేదాలున్నాయనే మాట వినిపిస్తోంది.

అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌కు తారకరత్నకు మధ్య పడడం లేదనే మాట వినిపిస్తోంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక్కరిగా జూనియర్ ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. అయితే, తారకరత్నకు ఆ మేరకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదనే మాట వినిపిస్తోంది. తారకరత్న చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్దు అదరగొట్టడం లేదని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న విభేదాల కారణంగానే తారకరత్న వ్యతిరేకత ప్రదర్శించారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు తనకు ఆహ్వనం రాలేదని, ఆహ్వానం వచ్చి ఉంటే వెళ్లి ఉండేవాడినని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో జరిగిన మహానాడుకు తారకరత్న హాజరయ్యారు. తాత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీకి ఆహ్వానం అవసరం లేదని, నందమూరి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని తారకరత్న అన్నారు. ఆ రకంగా జూనియర్ ఎన్టీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు.

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, బాబాయ్ బాలయ్యకు దూరం అవుతుంటే, తారకరత్న దగ్గర కావాలని చూస్తున్నారు. సినీ పరిశ్రమలో ఓ పెద్ద హిట్ కోసం తారకరత్న వేచి చూస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌గా తన పేరుని మార్చుకుని నందీశ్వరుడు చిత్రంలో తారకరత్న నటించారు. అయితే ఆ సినిమా విజయవంతం కాకపోవటంతో ఆ పేరుతో ఆయన పాపులర్ కాలేదు. మొత్తం మీద, జూనియర్ ఎన్టీఆర్‌కు, తారకరత్నకు విభేదాలు ఉన్నట్లు తాజా పరిణామం బయటపెట్టింది.

మహానాడుకు మొదటి రోజు మొక్కుబడిగా హాజరైన నందమూరి హరికృష్ణ రెండో రోజు హాజరు కాలేదు. మొదటి రోజు కూడా పసుపు కండువా వేసుకోవడానికి నిరాకరించారు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే

ఇదిలావుంటే, జూనియర్ ఎన్టీఆర్‌పై తెలుగుదేశం శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత ఎన్టీఆర్ పేరు చెప్పి జనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చారని, ఎన్టీ రామారావు జయంతి రోజు జరిగిన మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదని ఆయన అన్నారు.

English summary

 A debate is going on the counter given by Nandamuri hero Tarakaratna to another Nandamuri hero Jr NTR on the issue of invitation to the Telugudesam party Mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X