శ్రీశాంత్ ఫ్రెండ్ అరెస్టు: శ్రీనివాసన్‌ను తప్పుపట్టిన పవార్

ఇదిలావుంటే, ఐపియల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగు వ్యవహారాలకు బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రస్తుత అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌ను తప్పు పట్టారు. దానికి శ్రీనివాసన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుత పరిస్థితికి ఎంతో బాధేస్తోందని, విచారం కలుగుతోందని ఆయన అన్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా తాను ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వివాదానికి శ్రీనివాసన్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
బిసిసిఐ చీఫ్‌గా శ్రీనివాసన్ రాజీనామా డిమాండ్‌పై పవార్ మాట్లాడలేదు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారాలపై హోం మంత్రిత్వ శాఖ విచారణ జరిపించాలన్న శశాంక్ మనోహర్ అభిప్రాయాన్ని శరద్ పవార్ బలపరిచారు.












Click it and Unblock the Notifications