వారి వ్యక్తిగతం: తెరాసలోకి ఎంపీల జంప్‌పై కిరణ్ రెడ్డి

తెలంగాణ అంశం చాలా జఠిలమైందని, సున్నితమైందని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు గడువులు పెడితే సరిపోదని, గడువులు పెట్టినంత మాత్రాన తెలంగాణ రాదని, తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు వేచిచూడాలని ఆయన అన్నారు. ఈ విషయంపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నాయకులు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
దేశానికి అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అటువంటి సమస్యలున్నాయని, అందువల్ల దేశానికి అంగీకారయోగ్యంగా తెలంగాణపై నిర్ణయం ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్‌గానే ఆలోచిస్తోందని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం అనుమతితో పాటు మీడియా అనుమతి కూడా తీసుకునే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.
పథకాలను ఆదర్శంగా గుర్తించింది
కేంద్ర ప్రణాళికా సంఘం రాష్ట్ర పథకాల విశిష్టతను గుర్తించిందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర పథకాలను ఆదర్శ పథకాలుగా ప్రణాళికా సంఘం ప్రశంసించిందని తెలిపారు. బంగారు తల్లి, ఇందిరమ్మ కలలు, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక పథకాలు వినూత్నంగా ఉన్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
పథకాల అమలు తీరును, ఫలితాలను పరిశీలించిన తర్వాత దేశవ్యాప్తంగా ఆ పథకాలను విస్తరించే ఆలోచన చేస్తామని ఆహ్లువాలియా అన్నట్లు చెప్పారు. విద్యుదుత్పత్తి, రహదారుల విస్తరణపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మాంటెక్ సూచించినట్లు తెలిపారు.
2013 - 14 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రణాళిక ఖరారైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 53 వేల కోట్ల ప్రణాళికా వ్యయంగా నిర్ణయించినట్లు ప్రణాళిక సంఘం తెలిపింది.
మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిశారు.












Click it and Unblock the Notifications