వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు కోరిక తప్పుకాదు: విహెచ్, లాభంలేదని పొంగులేటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పులేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురువారం అన్నారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు పార్టీ మారుతారనే విషయంపై ఆయన స్పందించారు. తాము డెడ్‌లైన్ పెట్టినా అధిష్టానం స్పందించలేదనే బాధ ఎంపీలలో కనిపిస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణ విషయమై ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో మాట్లాడే వరకు ఓపిక పట్టాలని ఆయన కోరారు. పార్టీ నుండి వెళ్లిపోయా వారి పట్ల ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవామా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించక పోవడం దారుణమన్నారు. పార్టీలో ఉండేవారుంటారు.. పోయేవాళ్లు పోతారు.. అన్నట్లుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలు ఉంటే ఎలా అన్నారు., పిఆర్పీ, కాంగ్రెసు మధ్య ఇంకా సమన్వయం కుదరలేదన్నారు.

ప్రయోజనం ఉండదు: పొంగులేటి

టిఎంపీలు పార్టీకి ద్రోహం చేయవద్దని పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరారు. వ్యక్తులు వెళ్లినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. పార్టీకి డెడ్ లైన్లు పెట్టడం సరికాదన్నారు. వెళ్లాలనుకున్న వారికి ఎంత చెప్పినా ప్రయోజనం ఉండదన్నారు.

నా రాజీనామాపై చర్చించలేదు: పార్థసారథి

తన రాజీనామాపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు చర్చించలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టే తన కేసులో న్యాయపోరాటం చేస్తానని అన్నారు. తనపై ఉన్న కేసుతో బ్యాంకులు, ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని ఆయన అన్నారు.

జూలై ఒకటి నుండి కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకు వస్తామని, అందరితో చర్చించాకే మంచి పాలసీ తీసుకొస్తామన్నారు. అక్టోబరు లేదా నవంబరులో డిఎస్సీ పరీక్షలు ఉంటాయన్నారు. అధికారుల నివేదిక సమర్పించిన అనంతరం టెట్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

English summary

 Congress Party senior leader and Rajyasabha Member V Hanumantha Rao has supported Tourism Minister Chiranjeevi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X