నాన్చి మోసం: కెసిఆర్‌పై రాజయ్య అలక, బిజెపి వైపు...

K Chandrasekhar Rao - Rajaiah
హైదరాబాద్/వరంగల్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, వరంగల్ పార్లమెంటు సభ్యుడు రాజయ్య తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల అలక వహించారట. వరంగల్ పార్లమెంటు స్థానంతో పాటు మానకొండూరు అసెంబ్లీ టిక్కెట్ విషయమై రాజయ్యకు మొదట కెసిఆర్ హామీ ఇచ్చారట. ఆ తర్వాత మాత్రం వెనక్కి తగ్గారని అంటున్నారు. దీంతో రాజయ్య తెరాసలో చేరికపై వెనక్కి తగ్గారని అంటున్నారు.

దీంతో తనను పిలిచి అవమానించారని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అందుకే తెరాసలోకి వెళ్లేందుకు ఇష్టం చూపడం లేదంటున్నారు. ఆయన ఈ రోజు వరంగల్ జిల్లాలో మాటాలాడుతూ.. తాను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో ఉంటూనే తాను ప్రత్యేక రాష్ట్రం కోసం చివరిదాకా పోరాడుతానన్నారు. తనకు తెరాస నుండి ఆహ్వానం అందిందని కానీ, కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు.

తెరాసలోకి తనను ఆహ్వానించినప్పుడు అసెంబ్లీకైనా సరేనని చెప్పానని అన్నారు. తెరాసలో చేరే నేతలకు ఫ్యామిలీ ప్యాకేజీలు ఇస్తున్నారని ఆరోపించారు. తనకు ఇచ్చిన హామీపై వెనక్కి తగ్గడం పట్ల రాజయ్య పూర్తిగా అసంతృప్తితో ఉన్నారట. తనకు టిక్కెట్ ఇస్తానని చివరి వరకు నాన్చి తనను మోసం చేశారని ఆయన ఆవేదన చెందుతున్నారట. అయితే ఆయన కాంగ్రెసులోనే ఉంటానని చెబుతున్నప్పటికి బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఆయనతో బిజెపి నేతలు టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది. బిజెపిలోకి వస్తే వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఇస్తామని చెబుతున్నట్లుగా సమాచారం. తనను పిలిచి అవమానించారని ఆవేదన చెందుతున్న రాజయ్య తెలంగాణ కోసం బిజెపిలో చేరే అవకాశాలున్నాయంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+