ఇవి తేల్చండి, కలిపిస్తాం: మోత్కుపల్లికి హరీష్ సై

ఆ మూడింటికి అంగీకరిస్తే తమ పార్టీ చంద్ర బాబు పార్టీలో కలిపివేస్తామని శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మహానాడులో తెలుగుదేశం పార్టీ తెలంగాణను మరోమారు మోసం చేసిందని ఆయన విమర్శించారు. 2008 తీర్మానానికి కట్టుబడి ఉన్నామని టిడిపి నేతల ప్రకటనపై స్పందిస్తూ.. అదే నిజమైతే 2009 డిసెంబర్ 9న తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చావు నోట్లోకివెళ్లి తెలంగాణ సాధించాక జరిగిన పరిణామాలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాలని కోరారు.
తెలంగాణ తీర్మానానికి కట్టుబడి ఉంటే సమైక్యాంధ్రకోసం తెలుగుదేశం పార్టీ వారు బస్సుయాత్ర, నిరాహారదీక్షలు, ధర్నాలు ఎందుకు చేశారు? పార్లమెంట్‌లో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నినాదాలెందుకు చేశారు? ఆ తప్పులకు చెంపలేసుకుంటారా? అని హరీష్ రావు ప్రశ్నించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రెండు రకాల నివేదికలు ఇచ్చి తెలంగాణ రాకుండా చేసింది టిడిపి వారేనని విమర్శించారు.
మహానాడులో తెలంగాణపై తీర్మానం తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుతో కాకుండా సమైక్యాంధ్ర వాదులైన పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, కోడెల లాంటి వారితో చేయిస్తే కొంత మారారేమోనని ప్రజలు అనుకునేవారన్నారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ ఎంపీలు డెడ్‌లైన్లు పెడితే బెదరబోమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడటం వాస్తవానికి దూరంగా ఉందని, అధికారం మత్తులో మాట్లాడిన మాటల్లా ఉన్నాయని దుయ్యబట్టారు.
తరచూ డెడ్‌లైన్లు పెట్టి తెలంగాణ ప్రజలను మోసగించింది కాంగ్రెస్ పెద్దలేనని ధ్వజమెత్తారు. వంద కోట్ల దేశ ప్రజలు ఒప్పుకొంటేనే తెలంగాణ అని వైఎస్ అనగా, అదే అహంకారంతో దేశమంతా అంగీకరిస్తేనే తెలంగాణ అని కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications