నువ్వెంత, నీ బతుకెంత: కెటిఆర్‌పై జగ్గారెడ్డి ఫైర్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి అవాకులు, చవాకులు పేలితే సహించేది లేదని ఆయన తెరాస శాసనసభ్యులు కెటిఆర్, హరీష్ రావులను ఆయన హెచ్చరించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ నివాదం ఇవ్వడం తప్పిస్తే తెలంగాణకు వారు చేసిందేం ఉందని ఆయన అన్నారు. 12 ఏళ్లు చట్టసభలో ఉండి తెలంగాణ ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెసు జాతీయ పార్టీ అని, దానికి ఓ పద్ధతి ఉంటుందని, పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని ఆయన అన్నారు. బోగస్ దీక్షతో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రజలను మోసం చేశారని ఆయన విమర్శించారు దేశం కోసం సోనియా గాంధీ, ఆమె కుటుంబ సభ్యులు త్యాగాలు చేశారని ఆయన చెప్పారు. కెసిఆర్ పార్టీకి, కెసిఆర్‌కు ఓ పద్ధతి లేదని ఆయన తప్పు పట్టారు. ఎవరికి ఎంత దొరికితే అంత దోచుకోవడమే తెరాస పద్ధతి అని విమర్శించారు.
సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కెసిఆర్ లాగా మాయమాటలు చెప్పేవారు కాదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ కుటుంబం ఏం చేసిందని ఆయన అడిగారు. కిరణ్ కుమార్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు సహించబోరని, రోడ్ల మీద నిలుదీస్తారని ఆయన అన్నారు. అటువంటి దుస్థితిని తెచ్చుకోవద్దని తాను కెటిఆర్‌ను, హరీష్ రావును హెచ్చరిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెసు మోసం చేస్తుందని కేశవరావుకు యాభై ఏళ్లకు తెలిసిందా అని జగ్గారెడ్డి అడిగారు. మళ్లీ గెలువలేమనే అనుమానంతోనే కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెరాసలోకి వెళ్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కావూరి సాంబశివరావును పిలిచినట్లే సోనియా గాంధీ కేశవరావును పిలిచి మాట్లాడారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications