కావూరికి బుజ్జగింపులు, వీరి పట్ల ఇలా: పిఎంపై కోదండ

ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే పైసలకు కేంద్రం లొంగిపోతోందని, డబ్బు సంచులకే కేందర్ంలో విలువ ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణకు గడువులు పెట్టింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. కేంద్రం అన్ని విలువలూ కోల్పోయి దిగజారిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణపై కేంద్రాన్ని నిలదీయడానికే ఈ నెల 14వ తేదీన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని విలువలకూ తిలోదకాలిచ్చి దిగజారి వ్యవహరిస్తోందని కోదండరామ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీకి ఏ విధమైన విలువలూ లేవని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తోందని ఆయన అన్నారు. సబ్ ప్లాల్ అంటూ హడావిడి చేస్తూ అదే సామాజిక వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యులు పార్టీని వీడుతుంటే పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
హరీష్ రావుపై దానం ఫైర్
తమ షరతులకు అంగీకరిస్తే తమ పార్టీని తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు చేసిన ప్రకటనపై రాష్ట్ర మంత్రి దానం నాగేందర్ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో తెరాస విలీనంపై హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణను ఎలా తెస్తుందని హరీష్ రావు విలీనం చేస్తామని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు అధిష్టానం ఇన్నిసార్లు చర్చించిందని ఆయన అన్నారు. పార్టీని వీడాలనే కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పునరాలోచించుకోవాలని, తెలంగాణ ఇవ్వబోమని కాంగ్రెసు అధిష్టానం చెప్తే అలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన అన్నారు. పార్టీ కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణపై చర్చించే అవకాశం ఉందని మంత్రి చెప్పారు.












Click it and Unblock the Notifications