కెసిఆర్ ప్రకటించాలి: హరీష్ సవాల్‌పై రేవంత్ రెడ్డి

తెలంగాణపై తమ పార్టీకి స్పష్టత ఉందని చెప్పారు. హరీష్ రావుపై తెరాస బహిష్కృత నేత రఘునందనరావు చేసిన ఆరోపణలపై కెసిఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. తెలుగుదేశం పార్టీలో విలీనం చేస్తామని హరీష్ రావు చేసిన ప్రకటన వ్యక్తిగతమా, పార్టీ అభిప్రాయమా అని ఆయన అడిగారు. పార్టీ విలీనంపై హరీష్ రావు పెట్టిన షరతులను కెసిఆర్ అంగీకరిస్తే తాము మాట్లాడుతామని ఆయన అన్నారు. పార్టీ అధికార ప్రతినిధిగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అనుమతి మేరకే తాను మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు.
రాజకీయ ప్రయోజనం కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీని లక్ష్యం చేసుకున్నారని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఉద్యమాన్ని పక్కన పెట్టి కెసిఆర్ రాజకీయ డ్రామాకు తెరలేపారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెరాస రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు తెలుగుదేశం పార్టీతో కలిసి రావాలని ఆయన సూచించారు. తెలంగాణకు ప్రధాన అడ్డంకి కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించకుండా తమ పార్టీపై విమర్శలు చేస్తే తెలంగాణ ఎలా వస్తుందని ఆయన అడిగారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ జెఎసి తరఫున అమరవీరుల వారసులను ఎన్నికల్లో నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను తిడితే తెలంగాణ రాధని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో లాభపడాలని కెసిఆర్ చూస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీకి స్పష్టత ఉందని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డికి అర్థం కాలేదు
తెలుగుదేశం పార్టీలో తమ పార్టీ విలీనంపై తాను చేసిన ప్రకటన తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి అర్థమైనట్లు లేదని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు అన్నారు. సమైక్యాంధ్రకు జైకొడుతూ తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేశానని ఆయన గుర్తు చేశారు. అలా చంద్రబాబు క్షమాపణ చెప్తే విలీనం గురించి ఆలోచిస్తామని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications