తాగి, తాగించి తల్లి ప్రియుడిని హత్య చేసిన బాలుడు

పథకం ప్రకారం అతన్ని బాలుడు హత్య చేశాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామ సమీపంలో బాలుడు ఆ వ్యక్తిని హత్య చేశాడు. మే 24వ తేదీన అనుమానాస్పద స్థితిలో వ్యక్తి శవం కనిపించింది. పోలీసులు దర్యాప్తు చేయగా మిస్టరీ వీడింది. 14 ఏళ్ల బాలుడు అతన్ని మట్టుబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంఘటనకు చెందిన వివరాలను సిఐ కిశోర్ బాబు శుక్రవారం వెల్లడించారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి - జయంతిపురానికి చెందిన తేజోవత్ వెంకటరమణ అదే గ్రామానికి చెందిన వివాహితతో నాలుగేళ్లుగా వైవాహికేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆ వ్యవహారం నచ్చక ఆమె భర్త మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత వెంకటరమణ రోజూ మద్యం సేవించి వచ్చి మహిళను, ఆమె 14 ఏళ్ల కుమారుడిని వేధిస్తుండేవాడు. పది రోజుల క్రితం అతడు చేసిన దాడిలో బాలుడి తలకు గాయమైంది. దీంతో బాలుడికి అతనిపై కక్ష పెరిగింది.
మే 24వ తేదీన వెంకటరమణ, ఆ బాలుడు కలిసి సారా తాగారు. అతిగా తాగిన వెంకటరమణ పడిపోవడంతో బాలుడు అతని మర్మాంగం, గొంతు నులిమి హత్య చేశాడు. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనుమానం వచ్చి బాలుడిని ప్రశ్నించాడు. దీంతో బాలుడు నేరం అంగీకరించాడు.












Click it and Unblock the Notifications