ఇన్ఫోసిస్‌లోకి నారాయణమూర్తి రీఎంట్రీ: రూపాయి జీతం
బెంగళూర్: ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) దిగ్గజం ఇన్ఫోసిస్ బోర్డులోకి నారాయణ మూర్తి మళ్లీ వచ్చారు. నారాయణమూర్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులయ్యారు. జూన్ 1వ తేదీ నుంచి నారాయణమూర్తి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా3, అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని ఇన్ఫోసిస్ ఓ ప్రకటనలో తెలిపింది.
బోర్డు చైర్మన్ పదవికి 65 ఏళ్ల కెవి కామత్ రాజీనామా చేశారు. జూన్ 1వ తేదీ నుంచి ఆయన లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. తిరిగి తనను బోర్డులకు ఆహ్వానించడంపై నారాయణ మూర్తి స్పందించారు. ఇది అకస్మాత్తుగా, అనూహ్యంగా, అసాధారణంగా జరిగిందని అన్నారు. ఇన్ఫోసిస్ తన మిడిల్ చైల్డ్ అని, దాంతో మిగతా ప్రణాళికలను పక్కన పెట్టి తాను బాధ్యతలను అంగీకరించానని ఆయన అన్నారు.

తనకు ఈ అవకాశం కల్పించినందుకు చైర్మన్ కెవి కామత్‌కు బోర్డుకు, ప్రతి ఇన్ఫోసిసియన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు. సవాల్‌తో కూడిన ప్రస్తుత తరుణంలో కంపెనీకి విలువ చేకూర్చే విధంగా పనిచేస్తానని ఆయన చెప్పారు. నారాయణమూర్తి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నెలకు రూపాయి జీతం తీసుకుంటారు.
సాంకేతిక పరిశ్రమ, సంస్థ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సవాళ్ల నేపథ్యంలో స్టేక్‌హోల్డర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నామని కామత్ అన్నారు. సవాళ్లను ఎదుర్కుంటున్న ఈ సమయంలో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications