విలీనంపై సవాళ్లు: రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌రావు మెలిక

తామిచ్చిన లేఖ సంతృప్తికరంగా లేకుంటే మీరు లేఖ తెస్తే బాబు సంతకం చేసిస్తారని, అప్పుడు తెరాసను టిడిపిలో విలీనం చేయాలని మోత్కుపల్లి నర్సింహులు తొలుత సవాల్ చేశారు. దానికి హరీష్ రావు సై అన్నారు. దళితులను ముఖ్యమంత్రిగా చేయాలని బాబు హామీ ఇస్తే మేం విలీన ప్రతిపాదనకు ముందుకొస్తామని హరీష్ రావు తమ డిమాండ్ ముందు పెట్టారు. అందుకు సై అని రేవంత్ రెడ్డి అన్నారు.
దీంతో హరీష్ రావు కొత్త అంశం తెరపైకి తీసుకు వచ్చారు. సమైక్యాంధ్రకు జై కొట్టి, తెలంగాణను అడ్డుకున్నందుకు ముందుగా చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెబుతూ లెంపలేసుకుంటేనే ఆ పార్టీలో తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామని హరీశ్ రావు అన్నారు. టిడిపిలో తెరాస విలీనంపై తాను చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి అర్థంకానట్టు ఉందన్నారు.
"2009 డిసెంబర్ 9 నాటి ప్రకటన తర్వాత టిడిపి యూటర్న్ తీసుకోవటం వల్లనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వెనక్కి వెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిందే టిడిపి. రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించిన పార్టీ అది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రెండు నివేదికలు ఇచ్చి.. పార్లమెంటులో సమైక్యాంధ్ర కోసం ప్లకార్డులు పట్టింది. ఈ తప్పులన్నింటినీ బాబు ఒప్పుకొని బహిరంగంగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆ పని చేయించాలి. అప్పుడే విలీనంపై మా పొలిట్‌బ్యూరోలో చర్చిస్తాం'' అన్నారు. ఆ తరువాతే మూడు షరతుల గురించిన చర్చలోకి వెళదామని సూచించారు.












Click it and Unblock the Notifications