కెసిఆర్ సక్సెసవుతున్నారు, సన్మానించాలి: జగ్గారెడ్డి

Jagga Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ నేతలు వేర్వేరుగా మండిపడ్డారు. ప్రభుత్వ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మాయమాటలు, దొంగ మాటలు చెప్పి వారిని తప్పుదోవ పట్టించడంలో కెసిఆర్ విజయవంతమవుతున్నారని, అందుకు ఆయనకు సన్మానం చేయాలని ఎద్దేవా చేశారు.

గత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డి, రోశయ్య, ప్రస్తుత సిఎం ముఖ్యమంత్రి వద్ద హరీష్ రావు నిధులు తీసుకు వెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసుకోలేదా అని ప్రస్నించారు. అలాంటప్పుడు కిరణ్ నిధులు ఇవ్వనన్నారని ఎలా అంటారన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం వేరన్నారు. కెసిఆర్ సంవత్సరంపాటు కేంద్రంలో మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని మండిపడ్డారు.

ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. దొంగమాటలతో ప్రజలతో ఆడుకుంటున్నారన్నారు. కిరణ్ తెలంగాణ అభివృద్ధి కోసం భారీగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. సకల జనుల సమ్మెను కెసిఆర్ అమ్ముకున్నారని టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు వేరుగా అన్నారు. అప్పుడే మరో వారం రోజులు చేసి ఉంటే తెలంగాణ వచ్చేదన్నారు. టిడిపిని విమర్శిస్తున్న కెసిఆర్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలని ఎందుకు విమర్శించడం లేదని మండిపడ్డారు.

కెసిఆర్ పన్నెండేళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. కెసిఆర్‌కు తెలంగాణ కావాలా లేక రాజకీ పార్టీ కావాలా అని ప్రశ్నించారు. ఓట్లు, నోట్లు, సీట్ల కోసమే కెసిఆర్ తాపత్రయపడుతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+