తెలంగాణపై బిజెపికి కెసిఆర్ రిప్లై: జగన్‌, బాబులపై ఫైర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదనే బిజెపి నేతల వాదనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు సమాధానం ఇచ్చారు. హైదరాబాదులోని నిజాం కళాశాల మైదానంలో జరిగిన సోమవారం సాయంత్రం జరిగిన తెలంగాణ ఆత్మగౌరవ సభలో బిజెపి నాయకులు ప్రాంతీయ పార్టీలతో తెలంగాణ సాధ్యం కాదని అంటున్న తరుణంలోనే వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో జరిగిన సభలో కెసిఆర్ దానికి సమాధానం ఇచ్చారు.

ఉప ప్రాంతీయ పార్టీతో తెలంగాణ ఎలా సాధిస్తారని కొందరు తనపై విమర్శలు చేస్తున్నారని, ఈ విషయంపై నాగం జనార్దన్ రెడ్డి కూడా తనను ప్రశ్నించారని కెసిఆర్ అన్నారు. జార్ఖండ్ రాష్ట్రాన్ని ఏ జాతీయ పార్టీ తెచ్చిందని, జార్ఖండ్ ముక్తి మోర్చా జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించుకోలేదా అని ఆయన అడిగారు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వాల యుగమేననని ఆయన అన్నారు. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించుకుంటామని ఆయన అన్నారు. ఇవాళ తెలంగాణలో ఉప ప్రాంతీయ పార్టీ తెరాస పుట్టుకొచ్చింది కాబట్టే అందరూ జై తెలంగాణ అంటున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ ఏర్పాటును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను ఆమరణ దీక్ష చేసి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని 24 గంటలు తిరగకముందే సీమాంధ్ర పార్టీలు, నాయకులు అడ్డుకున్నట్లు ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంటులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్లకార్డు పట్టుకుని అడ్డుకున్నారని, తెల్లారే కల్లా కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి సీమాంధ్ర బాబు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు.

సీమాంధ్ర పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసే ఎదురు తిరిగామని ఆయన చెప్పారు. ఈ వేదికపై ఉన్న కడియం శ్రీహరి, తాను టిడిపి నుంచి వచ్చినవాళ్లమేనని, అక్కడ అన్యాయం చూసే ఎదురు తిరిగి ఆత్మగౌరవంతో బయటకు వచ్చామని కెసిఆర్ అన్నారు.

వరంగల్ ఎంపీగా కడియం పోటీ

వరంగల్ లోకసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా కడియం శ్రీహరి పోటీ చేయడం ఖాయమైంది. శ్రీహరి సేవలు పార్టీకి, ప్రజలకు చాలా అవసరమని, ఇప్పటి వరకు కడియం శ్రీహరిని ఘనపూర్ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఈసారి శ్రీహరిని తనతో పాటు పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి తీసుకుని పోతానని ఆయన అన్నారు. దీంతో వరంగల్ పార్లమెంటు టికెట్ కడియం శ్రీహరికి ఖరారైనట్లేనని అర్థం చేసుకోవచ్చు.

పాప పరిహారంగానే తెరాసలో చేరా: కడియం

ఇన్నాళ్లు సీమాంధ్ర పార్టీలో కొనసాగినందుకు పాపపరిహారంగానే తెరాసలో చేరానని కడియం శ్రీహరి చెప్పారు. తెలంగాణను సీమాంధ్ర పార్టీలు అడ్డుకున్నాయని విమర్శించారు. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో ఆ పార్టీ తెలంగాణ నాయకులు అనిపించలేకపోయారని కడియం శ్రీహరి అన్నారు. మహానాడులో తీర్మానం చేయలేకపోయారని ఆయన అన్నారు.

తెలంగాణ టిడిపి నేతలు ఆత్మవంచన చేసుకుని ఆ పార్టీలో కొనసాగవద్దని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకున్న సీమాంధ్ర పార్టీల చేష్టలను కళ్లారా చూసి సహించలేక తాను తెరాసలోకి వచ్చానని అన్నారు. ఆంధ్ర పార్టీల వల్ల తెలంగాణ రాదని గ్రహించానని చెప్పారు. కాకుల గుంపు వదిలి కోకిల గుంపులోకి వచ్చానని కడియం శ్రీహరి అన్నారు. తనకు సొంత ఇంటికి వచ్చినట్లుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+