జగన్ విషయం కోర్టు తేలుస్తుంది: కోట్ల, డిఎల్‌పై స్పందన

కొందరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు కోర్టులో రుజువు కాలేదని చెప్పారు. అలాంటి అభియోగాలు అన్ని పార్టీల నేతల పైన ఉన్నాయని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చే విషయం న్యాయస్థానం తేలుస్తుందన్నారు.
డిఎల్ రవీంద్రా రెడ్డిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని, అదీ అయన విదేశీ పర్యటనలో ఉండగా ఇలా చేయడం సబబు కాదని కేంద్ర రైల్వే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. డిఎల్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత సంప్రదింపులు జరిపి బర్తరఫ్ చేసి ఉండాల్సిందని మంత్రి కోట్ల వ్యాఖ్యానించారు. బర్తరఫ్ ముఖ్యమంత్రి వ్యక్తిగత విషయమన్నారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అధ్యక్షులు కె కేశవ రావు, ఎంపీలు మందా జగన్నాథంలకు 'సన్' స్ట్రోక్ తగలడం వల్లే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లారని అమలాపురం పార్లమెంటు సభ్యుడు హర్ష కుమార్ ఆదివారం ఎద్దేవా చేశారు. కొడుకుల కోసమే వారు జంప్ చేశారన్నారు.












Click it and Unblock the Notifications