వాషింగ్ మిషన్‌లో బిడ్డనీ.. బకెట్లో కొడుకునీ... అత్మహత్య

తూర్పు ఢిల్లీలోని మండవాలిలో ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ముగ్గురు కూడా మరణించి కనిపించారు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త తలుపులు తట్టాడు. లోపలి నుంచి గడియ పెట్టింది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో విరగ్గొట్టి లోనికి ప్రవేశించాడు.
ఇంటిలో ముగ్గురి శవాలు చూసి అతను బిత్తరపోయాడు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. తాము ఆత్మహత్యగానే భావిస్తున్నామని, పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అంటున్నారు. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.
సూసైడ్ నోట్ కూడా కనిపించకపోవడంతో సరిత ఇంత దారుణానికి ఓడిగట్టడానికి కారణమేమిటో తెలియడం లేదు. ఈ సంఘటనతో భర్త దేవేందర్ యాదవ్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications