సమస్య సృష్టించొద్దు: చిరంజీవి, బొత్సలపై కిరణ్ పైచేయి

Kiran, Chiru and Bosta
హైదరాబాద్: రెండు రోజుల పాటు హస్తినలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలు ఢిల్లీలో ఉండి అధిష్టానం పెద్దలతో చర్చోపచర్చలు జరపడం, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ జరపడం ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలను, ప్రధానంగా కాంగ్రెసు రాజకీయాలను వేడెక్కించాయి.

కిరణ్‌కు వ్యతిరేకంగా చిరు, దామోదర, బొత్సలు ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. కిరణ్ ఒంటెత్తు పోకడలతో వెళ్తున్నారని, మెజార్టీ నేతలు ఆయనను వ్యతిరేకిస్తున్నారని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ముఖ్యమంత్రిని మార్చాలని, ఆయన స్థానంలో దామోదరను నియమించాలనే సూచనలు చేశారని ప్రచారం సాగుతోంది. అయితే సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఇప్పుడు భారీ మార్పులు చేర్పులు వద్దని అధిష్టానం సూచించిందట.

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అంశం చర్చకు వచ్చినప్పుడు... అంతా అధిష్టానం అనుమతితోనే జరుగుతోందని, ముఖ్యమంత్రికి అందరూ సహకరించాలని సూచించారట. సి.రామచంద్రయ్య పదవి పోతుందనే ప్రచారాన్ని చిరు అధినేత్రి ముందు ప్రస్తావిస్తే.. హామీ ఇచ్చినప్పటికీ, అదుపులో ఉంచాలని సూచించారట. పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా మాట్లాడవద్దని సూచించాలని ఇతర నేతలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు పోటా పోటీగా జరిగిన ఈ ఢిల్లీ పర్యటన ముఖ్యమంత్రి అనుకూలంగా కనిపించిందని అంటున్నారు. అయితే అందర్నీ కలుపుకొని పోవాలని కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అధిష్టానం సూచించిందట. ముఖ్యమంత్రికి ఎలాంటి సమస్యలు సృష్టించవద్దని, అలాగే ఆయన అందర్నీ కలుపుకుపోవాలని హితవు పలికారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+