వైయస్ లాగే కిరణ్ రెడ్డి: దామోదర, హోంకు లాబీ

Damodara Rajanarsimha
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ వైయస్ రాజశేఖర రెడ్డి లాగా అధికార కేంద్రంగా మారాలని ప్రయత్నిస్తున్నారని ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌కు చెప్పినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరిని అదుపు చేయకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన చెప్పారని సమాచారం.

ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు ప్రాధాన్యం లభించకుండా ముఖ్యమంత్రి చూస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల్లో తన పాత్ర లేకుండా చేస్తున్నారని ఆయన చెప్పినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ - ఆ కసరత్తు మొత్తం తన ఆధ్వర్యంలో జరిగిందని, అయితే తానే రూపొందించినట్లుగా కిరణ్ ప్రచారం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

డిఎల్ రవీంద్రా రెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించటం, తెలంగాణ అంశం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జైపాల్ రెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. ఈ భేటీలో వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కూడా పాల్గొన్నారు. డిఎల్ బర్తరఫ్‌తో పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అభద్రత భావం నెలకొన్నదని, ముఖ్యమంత్రి బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నట్లు తెలిసింది. తాను మాత్రం ఎవరికీ భయపడబోనని రాజనరసింహ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.

అదే సమయంలో మంత్రివర్గంలో హోంశాఖ కోసం ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఢిల్లీ వచ్చిన ఆయన అధిష్ఠానం పెద్దలకు ఆ మేరకు విజ్ఞప్తులు చేసినట్లు సమాచారం. బుధవారం రాత్రి దామోదర రాజనర్సింహ సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ను కలిశారు. గురువారం ఉదయం సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఆమెతో సమావేశమయ్యే ముందు ఒకసారి, ఆ తర్వాత మరోసారి ఆజాద్‌ను కలిశారు.

అలాగే, తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను వారివారి నివాసాల్లో కలిశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను ఆయన కార్యాలయానికి వెళ్లి కలిశారు. తెలంగాణకు చెందిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన హోం శాఖను తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలని, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు సీమాంధ్రకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున హోంశాఖను తెలంగాణకే ఇవ్వాలని ఆయన చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+