వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసు వేయకుంటే జగన్ సిఎం అయ్యేవారు: శంకర రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తాను ఎలాంటి కేసు పెట్టకుంటే అతను ముఖ్యమంత్రి పదవిలో ఉండేవారని మాజీ మంత్రి, కంటోన్మెంటు శాసన సభ్యుడు పి.శంకర రావు శుక్రవారం అన్నారు. తమ పార్టీ అధిష్టానం నెల రోజుల్లో భారీ మార్పులు చేయనుందని జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తొలగిస్తుందన్నారు.

ఓర్వలేక ఆరోపణలు: ఎమ్మెల్యే సోదరుడు

రాజకీయంగా తమను ఎదుర్కోలేక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాయని ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి సోదరుడు ఎర్రిస్వామి రెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లాలో అన్నారు. తాము మిస్సమ్మ స్థలాన్ని అధికారికంగా కొనుగోలు చేసినా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమను కబ్జాకోరులుగా చిత్రీకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆనం ఆధ్వర్యంలో ఆర్థిక మండలి సమావేశం

ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్థిక మండలి సమావేశమైంది. 2013-14 రుణ విధానం పైన చర్చించనున్నారు. కాగా, ఆగస్టు నుండి రెండో విడత భూ పంపిణీ ఉంటుందని మంత్రి రఘువీరా రెడ్డి నిజామాబాద్ జిల్లాలో చెప్పారు.

వంగవీటి శంతన్ అరెస్ట్

బచ్చురాజు కిడ్నాప్ కేసు విషయంలో కెపిహెచ్‌బి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన వంగవీటి శంతన్ కుమార్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కిడ్నాప్‌కు భూవివాదమే కారణమని తెలుస్తోంది.

English summary
Minister Shankar Rao said Kiran Kumar Reddy will remove within month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X