శిల్పా భర్త కుంద్రా అరెస్టును తప్పించుకుంటారా?

కుంద్రాను పోలీసులు అరెస్టు చేయవచ్చుననే వార్తలు వచ్చినప్పటికీ తగిన సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేస్తే ఇబ్బందుల్లో పడుతామనే ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కుంద్రాపై ఆధారాలు లభించలేదని, దాంతో ఆయనను అరెస్టు చేయలేమని నీరజ్ కుమార్ శుక్రవారం టీవీ చానెళ్లతో చెప్పారు.
తన మిత్రుడు, వ్యాపార భాగస్వామి ఉమేషథ్ గోయంకా ద్వారా కుంద్రా బెట్టింగుకు పాల్పడ్డాడని, బెట్టింగులో పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడని ఆయన గురువారంనాడు చెప్పారు. ఉమేష్ గోయంకా బుకీగా వ్యవహరించాడు.
తాను నిర్దోషినని కుంద్రా శుక్రవారం ఓ ప్రకటనలో చెప్పారు. రాజస్థాన్ రాయల్స్ వాటాదారుడిగా ఢిల్లీ పోలీసు దర్యాప్తు బృందానికి తనను విచారించే హక్కు ఉందని, చట్టానికి కట్టుబడే పౌరుడిగా తాను విచారణకు హాజరయ్యానని, పోలీసులు వేసిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చానని, విచారణ తర్వాత వెళ్లిపోవడానికి తనను అనుమతించారని ఆయన వివరించారు.
కుంద్రాకు బెట్టింగుతో సంబంధం ఉన్నప్పటికీ స్పాట్ ఫిక్సింగ్‌తో మాత్రం సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. కుంద్రాను మరోసారి విచారణకు పిలుస్తామని కూడా పోలీసులు అంటున్నారు. కుంద్రా సహ యజమానిగా ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్ అరెస్టయిన విషయం తెలిసిందే.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications