గెలిచే సత్తాలేకే: విహెచ్, జెఏసి పిలిస్తే వస్తారా?: కెసిఆర్

ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు సి.రామచంద్రయ్య, ముఖేశ్ గౌడ్ తదితరులు వచ్చారు. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిబంధనలకు లోబడి, అన్ని రకాలుగా విచారించిన అనంతరం ఎమ్మెల్యేల అనర్హత పైన నిర్ణయం తీసుకున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమైందని ఆయన చెప్పారు.
జగన్‌ను నమ్ముకోవడం వల్ల అధికారులు కొందరు జైలులో ఉండగా, ఎమ్మెల్యేలు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వేరుగా అన్నారు. వచ్చే ఎన్నికలలో గెలుచే సత్తా లేని నేతలే తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వెళ్లారన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినా తాము సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు.
శాంతిభద్రతల సమస్య ఎదుర్కొంటాం: గంటా
ఛలో అసెంబ్లీని తెలంగాణవాదులు శాంతియుతంగా చేసుకునే హక్కు ఉందని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. శాంతిభద్రతల సమస్యల తలెత్తితే మాత్రం సర్కారు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
జెఏసి పిలిస్తే ఎవరొస్తారు?: కెసిఆర్
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి జెఏసి పిలిస్తే ఎవరు వస్తారని, మనమే బాధ్యత తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. పోలీసులు అరెస్టు చేస్తే ఎక్కడికి అక్కడే ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు. తొమ్మిది డజ్పీ చైర్మన్ సీట్లు తెరాసవే అన్నారు. కొన్ని నియోజకవర్గాలలో శిక్షణా తరగతులు నామమాత్రంగా జరిగాయని, అవి పునరావృతం కావొద్దన్నారు. శిక్షణా తరగతులను కడియం శ్రీహరి చూసుకుంటారని చెప్పారు.
అనురాగ్ వర్సెస్ కోదండరామ్
ఛలో అసెంబ్లీకి అనుమతిలేదని, దీనిపై తమను ఎవరు సంప్రదించలేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. సోమవారం నుండి జరుగనున్న అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు జెఏసి చైర్మన్ కోదండరామ్ కమిషనర్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. తాము ఛలో అసెంబ్లీకి అనుమతి కోరుతూ డిజిపికి లేఖ ఇచ్చామని, కమిషనర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అన్నారు. ఎన్ని బారీకేడ్లు ఏర్పాటు చేసినా తాము విజయవంతం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications