బాబు డైరెక్షన్‌లో జగన్ కేసు, ఇదిగో ఆధారాలు: అంబటి

సిబిఐ ఇప్పటిదాకా ఎలాంటి కేసుల్లోనూ ఈ విధంగా మెమో దాఖలు చేయలేదని, ఉగ్రవాదుల కేసుల్లో కూడా ఇలాంటి మెమోలు దాఖలు కాలేదని గుర్తు చేశారు. సిబిఐ దాఖలు చేసే చార్జిషీట్లన్నింట్లోనూ చంద్రబాబు నోట్స్‌లోని అంశాలే ఉంటున్నాయని విమర్శించారు. ‘రెండ్రోజుల క్రితం బాబు చెంబు గ్యాంగ్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్, సునీల్, సాయి ఒకే జైల్లో ఉంటే ఎలాగని, కేసు నుంచి తప్పించుకోవడానికి ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తారని మాట్లాడారు.
అనంతరం సరిగ్గా అవే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టులో సిబిఐ మెమో దాఖలు చేసింది. చెంబు గ్యాంగ్ బయట అరవడం, సిబిఐ వాటిని అమలు చేయడం... ఇందతా చూస్తుంటే ఈ కథ మొత్తాన్నీ బాబే నడిపిస్తున్నారని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది' అన్నారు. అలాగే చంచల్‌గూడ జైలు విషయంలో టిడిపి రోజూ ఏదో రాద్ధాంతం చేయడాన్ని సాకుగా చూపి అధికారులు మరిన్ని నిబంధనలు విధిస్తున్నారన్నారు.
‘వీరి వాలకం చూస్తుంటే జగన్ ఎవరినీ కలవకూడదంటూ అండమాన్ జైలుకు పంపాలని కోరుకునేలా కనిపిస్తోంది. ఇదంతా జగన్‌ను మానసికంగా వేధించి రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్‌తో కలిసి బాబు ఆడిస్తున్న డ్రామా. రెండు పార్టీలు కలిసి జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు సిబిఐని, పోలీసు యంత్రాంగాన్ని వాడుకోవడం దురదృష్టకరం. ఆయనను జైల్లో వేసినా బాబు రాక్షస మనసుకు కక్ష తీరడం లేదు.
అత్యంత హీనంగా మద్యం, నీలిచిత్రాలంటూ నీతి బాహ్యంగా మాట్లాడుతున్నారు. అధికార దాహంతో బాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సందర్భంలో కూడా వారి కుటుంబసభ్యులను చీల్చి మానవతా విలువలను బాబు మంటగ లిపారు. ఎన్టీఆర్‌ను దించేయడానికి ఆయన అవలంబించిన దౌర్భాగ్య విధానాలన్నింటినీ రాష్ట్ర ప్రజలు కళ్లారా చూశారు' అంటూ అంబటి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications