తెరాసపై చావుడప్పు: కెసిఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని తెరాస తిరుగుబాటు నేత చింతా స్వామి హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కెసిఆర్‌తో పాటు జగదీశ్వర్ రెడ్డి, పద్మారావు, సుభాష్ రెడ్డిల పైన చింతా స్వామి ఫిర్యాదు చేశారు.

కాగా, చింతా స్వామి ఆదివారం తెలంగాణ భవన్ ఎదుట చావు డప్పు మోగించారు. కెసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆందోళనకారులపై తెరాస శ్రేణులు దాడికి దిగటం ఉద్రిక్తతకు దారి తీసింది. కెసిఆర్ ఉద్యమాన్ని వ్యాపారం చేస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ భవన్ ముందు ఆదివారం మధ్యాహ్నం చావు డప్పు మోగిస్తామని చింత స్వామి అంతకుముందే ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

భవన్ ముందున్న రోడ్డుకు రెండువైపులా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నియంత్రించారు. చింత స్వామి బృందాన్ని అడ్డుకోవటానికి తెరాస విద్యార్థి విభాగం కూడా సిద్ధమైంది. మరోవైపు ఇదే రోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉండటంతో టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్‌కు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2.05 నిమిషాలకు బసవతారకం కేన్సర్ హాస్పిటల్ వైపు నుంచి తెలంగాణ భవన్ దిశగా తరలి వస్తున్న తెలంగాణ మాదిగ దండోరాకు చెందిన కొంతమంది ఆందోళనకారులను పోలీసులు మధ్యలోనే అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో అంతా సద్దుమణిగిందని భావించారు.

చింత స్వామి తన అనుచరులతో కలిసి ఎవరూ ఊహించని విధంగా మూడు, నాలుగు వాహనాల్లో కెబిఆర్ పార్క్ వైపు ఉన్న రోడ్డు గుండా తెలంగాణ భవన్ ముందుకు చేరుకున్నారు. కెసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేపట్టారు. ముందు ఒకరు కుండతో నడిచారు. డోలక్‌లతో చావు డప్పు మోగించారు. ఆ సమయంలో కెసిఆర్ తన చాంబర్‌లో పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంతలో చింతా బృందం భవన్ ద్వారం వైపు వచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు.

మరోవైపు కెసిఆర్, హరీష్ రావు, విజయశాంతిల ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్ మరో బెంచ్‌కు బదలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+