జగన్‌దే హవా: శంకరన్న, కుమ్మక్కుపై డిఎల్ X రేవంత్

Shankar Rao
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాలు ఏర్పడతాయని మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు సోమవారం అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సీమాంధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తెరాసలు విజయం సాధిస్తాయన్నారు. గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ మాత్రం బాగా పెరిగిందని చెప్పారు. పిసిసి కార్యవర్గంలో ప్రజలతో సంబంధం లేని వాళ్లకే అవకాశం కల్పించారని ఆరోపించారు.

లాబీల్లో డిఎల్, రేవంత్ మధ్య ఆసక్తికర చర్చ

అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి, మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రా రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. గత అసెంబ్లీ సమావేశాలలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి పోయేదని రేవంత్‌తో డిఎల్ అన్నారు. ముఖ్యమంత్రితో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయారనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఆయన అన్నారు.

దానికి రేవంత్ రెడ్డి స్పందించారు. అవినీతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి తాము అవిశ్వాస తీర్మానానికి కలిసి ఎలా మద్దతిస్తామని డిఎల్‌ను ప్రశ్నించారు. తాము అవిశ్వాసానికి మద్దతిచ్చినా మజ్లిస్ పార్టీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడే పరిస్థితి ఉందని రేవంత్ సమాధానమిచ్చారు.

బిఏసి సమావేశం

సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం జరిగింది. రెండో విడత బడ్జెట్ సమావేశాల పని దినాలు, అజెండాను ఖరారు చేస్తారు. ఈ సమావేశంలో చంద్రబాబు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, విజయమ్మ, గుండా మల్లేష్, జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. 21వ తేది వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నిత్యావసర ధరలు, ఎరువుల కొరత తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.

తెలంగాణపై తీర్మానం చేయాలని ఈటెల రాజేందర్ కోరగా... అది కేంద్రం పరిధిలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకు మీరే ఒప్పించవచ్చుగా అని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మరో పదిరోజులు సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షాలు కోరగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుదరదని ప్రభుత్వం చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు 70 రోజులు పొడిగించాలని చెప్పారుగా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+