ట్విట్టేష్‌బాబు! దొంగనాటకాలు కట్టెయ్: లోకేష్‌పై భూమన

తమ పార్టీ నేతలు వలస వెళ్లడాన్ని ఆపేందుకు లోకేష్ ఈ తరహా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దొంగ సర్వేలు చేయించి టిడిపి అత్యధిక మెజార్టీ స్థానాలు గెలువబోతుందంటూ ఎస్సెమ్మెస్‌ల ప్రచారం చేస్తోందన్నారు. దీనికి లోకేష్ సారథ్యం వహిస్తున్నారన్నారు. లోకేష్‌ను భూమన ట్విట్టేస్ అంటూ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ 190 స్థానాల్లో గెలుస్తుందన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కాపు రామచంద్ర రెడ్డిలు విమర్శించారు. అందుకోసం మూడు సూత్రాలను సైతం ప్రతిపాదించారని మండిపడ్డారు.
ఇప్పటికైనా ఎన్నికల సంఘం జోక్యం చేసుకొని బడుగు, బలహీనవర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా గతంలో ఉన్న జిల్లానే యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరారు చేయాలని స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్‌లపై అసెంబ్లీలో చర్చకు లేవనెత్తుతామని వారు తెలిపారు.












Click it and Unblock the Notifications