షిండే ప్రకటన: తెలంగాణ కాంగ్రెసు నేతలు ఎటు వైపు?

Telangana
హైదరాబాద్: తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం కష్టమని, ఏకాభిప్రాయ సాధన సాధ్యం కావడం లేదని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనతో రాష్ట్ర కాంగ్రెసులో కలకలం ప్రారంభమైంది. ఇతర పార్టీలకు వెళ్లాలని అనుకుంటున్న నేతలకు ఆ ప్రకటన దారి చూపినట్లయింది. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా లేదని షిండే ప్రకటన దాదాపు స్పష్టంగా చేసింది. ఈ అంశాన్ని అలా వదిలేయడం మంచిదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని నిరసిస్తూ ఇద్దరు కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. మరింత మంది పార్లమెంటు సభ్యులు తమ పార్టీలోకి వస్తారని తెరాస నాయకులు చెబుతున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలని భావిస్తున్న నాయకులు కూడా అదును కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తన గురువు అని, వైయస్ చలువ వల్లనే నల్లగొండ జిల్లా అభివృద్ధి చెందిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దీన్ని బట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం ప్రారంభమైంది. తెలంగాణపై సోనియా గాంధీ నిర్ణయం ప్రకటించకపోతే తమ దారి తాము చూసుకుంటామని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడైన పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా వైయస్సార్ కాంగ్రెసులో చేరవచ్చుననే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

తెరాసలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య వెనక్కి తగ్గారు. తనకు పార్లమెంటు సీటు ఇవ్వడానికి తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు నిరాకరించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. తెరాసలోకి మరింత మంది నాయకులు కూడా వెళ్లే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలు సమీపించేనాటికి తెరాసలోకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి కాంగ్రెసు తెలంగాణ నేతలు వెళ్లే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఎవరు పార్టీని వీడినా నష్టం లేదనే పద్ధతిలో కాంగ్రెసు పార్టీ నాయకత్వం వ్యవహరిస్తోంది. పార్టీ మారాలనుకునే నాయకులను బుజ్జగించడానికి కూడా ఇష్టపడడం లేదు. పాత నాయకులు పోతే కొత్తవారికి అవకాశం వస్తుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడాన్ని బట్టి కాంగ్రెసు వైఖరి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఎదుర్కోవడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో ఆయన బంగారుతల్లి వంటి సంక్షేమ పథకాలను ముందుకు తెస్తూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+