సిబిఐ జెడి బదిలీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సిబిఐ జెడి బదిలీ అంశం తమ పరిధిలోకి వస్తుందా?రాదా? అనే అంశంపై అఫిటవిట్ దాఖలు చేయాలని తెలిపింది. వారంలోగా సప్లమెంటరీ అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. అవసరమైతే ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టుకు గాని, సుప్రీం కోర్టుకు గాని వెళ్లవచ్చని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.
వివిధ కేసుల దర్యాప్తు కీలకమైన దశలో ఉన్న సమయంలో సిబిఐ జెడి లక్ష్మినారాయణను బదిలీ చేయడం సరి కాదని అంటూ బదిలీని ఆపేయాలని కోరుతూ సి. కుటుంబరావు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జి. రోహిణిలతో కూడిన హైకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది.
కాగా, సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా లక్ష్మినారాయణను కొనసాగించరాదంటూ దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.
కెసిఆర్ కేసు విచారణ వాయిదా
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె చంద్రశేఖర రావు, పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, శాసనసభ్యుడు హరీష్‌రావు ఆస్తులపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. మరో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications