జగన్ కేసు: బ్రహ్మానందరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఇదిలావుంటే, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యూడీషియల్ కస్టడీకి తరలించాలంటూ సిబిఐ దాఖలు చేసిన మెమోపై విచారణను నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.
వారిద్దరు కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారంటూ, మీడియా ఎదుట మాట్లాడిన తీరు అందుకు నిదర్శమని చెబుతూ సిబిఐ కోర్టుకు సిడిలను సమర్పించింది. ఈ సిడిల వివరాలను లిఖిత పూర్వకంగా అందించాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తూ విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది.
వాన్‌పిక్ కేసులో ధర్మాన ప్రసాదరావు, దాల్మియా సిమెంట్స్ కేసులో సబిత ఇంద్రారెడ్డిలు అక్రమాలకు పాల్పడ్డారని సిబిఐ కోర్టుకు దాఖలుచేసిన చార్జిషీటులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరు బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తోంది.












Click it and Unblock the Notifications