వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టూర్ ముగించి రండి: జిందాల్‌కు సిబిఐ, దాసరిపై ఆనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dasari Narayana Rao - Naveen Jindal
హైదరాబాద్/నెల్లూరు: మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయనరావుపై సిబిఐ కేసు నమోదు వ్యవహరాన్ని న్యాయస్థానం చూసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లోని గోల్డెన్‌జూబ్లీ హాలులో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. దాసరి కేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. సిబిఐ స్వతంత్రంగానే దర్యాప్తు చేస్తోందన్నారు. బంగారు తల్లి పథకంపై మంత్రుల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని చెప్పారు. అసెంబ్లీలో తాను పద్ధతి ప్రకారమే మాట్లాడానని, స్పీకర్ వివరణ కోరితే ఇచ్చేందుకు సిద్ధమేనన్నారు.

బొగ్గు కుంభకోణంలో సిబిఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఇందులో చిక్కుకున్న వారికి త్వరలోనే సిబిఐ సమన్లు అందనున్నాయి. తమ విచక్షణాధికారంతో బొగ్గు బ్లాకుల్ని కేటాయించి, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం చేకూర్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న దాసరి, ఆ శాఖ కార్యదర్శిగా పనిచేసిన హెచ్‌సి గుప్తా, ప్రధాని కార్యాలయ అధికారులతో పాటు వాస్తవాలను తారుమారు చేసి లబ్ధి పొందిన జిందాల్ గ్రూపు సంస్థల డైరెక్టర్ నవీన్ జిందాల్‌ను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమైంది.

తాజాగా సిబిఐ పోరాటం ఫలించి బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సి గుప్తాని ప్రశ్నించడానికి కేంద్రం అనుమతినిచ్చింది. 2006 - 2009 మధ్య బొగ్గు బ్లాకుల లైసెన్సుల జారీలో సీనియర్ ఐఏఎస్ గుప్తా కీలక పాత్ర పోషించారు. పోటీ బిడ్డింగ్‌తో సంబంధం లేకుండా బొగ్గు బ్లాకుల కేటాయింపునకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీకి ఆయనే నేతృత్వం వహించారు. గుప్తా హయాంలో దాదాపు 68 బొగ్గు బ్లాకుల కేటాయింపులు జరిగాయి. అయితే ఎలాంటి పారదర్శకత పాటించకుండా, కంపెనీల అర్హతలు, సామర్థ్యం పరిశీలించకుండానే లైసెన్సులను స్క్రీనింగ్ కమిటీ జారీ చేసిందని సిబిఐ ఆరోపిస్తోంది. కమిటీకి తప్పుడు వివరాలు సమర్పించి పలు ప్రైవేట్ కంపెనీలు బొగ్గు బ్లాకులను పొందాయని కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

త్వరగా తిరిగి రండి: జిందాల్‌కు సిబిఐ

మరోవైపు ప్రస్తుతం కుటుంబంతో సహా విదేశీ పర్యటనలో ఉన్న నవీన్ జిందాల్‌ను వీలైనంత త్వరగా తిరిగి రావాలని సిబిఐ కోరింది. ఢిల్లీలోని ఆయన ఇంటిలో తాళాలు వేసి ఉన్న అల్మారాలను సోదా చేయాల్సి ఉందని, జిందాల్ వచ్చే వరకు వాటిని సీల్ చేసి ఉంచుతునట్లు అధికారులు తెలిపారు.

ఇంధన శాఖ తిరస్కరించినప్పటికీ జిందాల్ గ్రూప్‌నకు బొగ్గు బ్లాకులను కేటాయించినట్లు తాజాగా వెల్లడైనట్లుగా సమాచారం. బొగ్గు స్కాం దర్యాప్తు పత్రాల్లో ఈ విషయం ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇంధన శాఖ విధించిన నిబంధనలను పాటించకున్నా జిందాల్ గ్రూప్‌నకు బొగ్గు బ్లాకుల కేటాయింపులు దక్కిన వైనం ఆ పత్రాల్లో వివరంగా ఉన్నట్లు తెలిపింది. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని హర్యానాలోని హిసార్‌లో జిందాల్ ఇంటి వద్ద బిజెపి, హర్యానా జనహిత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం నిరసన తెలిపారు. వీరిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురికి గాయాలయ్యాయి.

English summary
The CBI, which had on Tuesday filed a case against Congress MP Naveen Jindal in the coalgate scam, has asked him to cut short his visit abroad with his family and join its probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X