వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ: తెలంగాణ నేత దామోదర కార్లో సిఎం బయటకు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Damodara Rajanarasimha
హైదరాబాద్: చలో అసెంబ్లీ నేపథ్యంలో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీలో తెలంగాణ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ శాసన సభ్యులు సభలో ఆందోళన చేయడంతో సభాపతి నాదెండ్ల మనోహర్ సభను సోమవారానికి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో సభ్యులు అందరు వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం తన కాన్వాయ్‌లో వెళితే అడ్డుకుంటారని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కాన్వాయ్‌లో సచివాలయానికి వెళ్లారు.

చలో అసెంబ్లీ నేపథ్యంలో ముఖ్యమంత్రి, సభాపతిలు ఉదయమే అసెంబ్లీకి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వెళ్లేటప్పుడు కూడా అడ్డుకుంటారని భావించి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన దామోదర కాన్వాయ్‌లో వెళ్లారు. అసెంబ్లీ గేట్ 1 వద్ద తెరాస, అసెంబ్లీ 2 గేట్ వద్ద సిపిఐ, బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో కిరణ్, సభాపతిలు మరో గేటు ద్వారా బయటకు వెళ్లారు.

మరోవైపు రోడ్డుపై పడుకొని వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెరాస నేత చంద్రశేఖర్ సహా పలువురిని లిబర్టీ వద్ద పోలీసులు అడ్డకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కాంగ్రెసు పార్టీదే అన్నారు.

English summary
CM Kiran Kumar Reddy reached secretariat in Deputy Chief Minister Damodara Rajanarasimha's car on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X