వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం గూండాగిరి: సిపిఐ, విగ్రహాలు కూల్చాలా?: శేషారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CPI Narayana
హైదరాబాద్: తెలంగాణవాదులు అడ్డుకుంటారనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్‌లు ఉదయాన్నే అసెంబ్లీకి వచ్చారని, అప్పుడే తెలంగాణవాదులు విజయం సాధించారని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం అన్నారు. చలో అసెంబ్లీని అడ్డుకోవడం, అరెస్టు చేయడం సరికాదన్నారు. తాను అసెంబ్లీకి రావడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సిఎం దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చారన్నారు. అంతకుముందు సిఎం కాన్వాయ్‌ను తెలంగాణవాదులు అడ్డుకున్నారు.

నాలుగున్నర కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం డిమాండ్ చేస్తుంటే అధికార పార్టీ దానిని పట్టించుకోకపోవడం దారుణమని బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై యూపిఏ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం గూండాగిరితో చలో అసెంబ్లీని అడ్డుకోవాలని చూస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత, అరెస్టులు, బైండోవర్లు లేవని ఆయన అబిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయాలకు వచ్చి అరెస్టులు చేయడం ఏ ప్రజాస్వామ్యమన్నారు. భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.

విగ్రహాలు కూల్చక్కరలేదు: శేషారెడ్డి

ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కానీ, అందుకోసం అసెంబ్లీ ముట్టడించాల్సిన అవసరం లేదని, విగ్రహాలు కూల్చక్కరలేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషా రెడ్డి అన్నారు. మరోవైపు చలో అసెంబ్లీ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఓయులో టెన్షన్

చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఎన్సీసి గేటు వద్దకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ముళ్లకంచెలు తొలగించి వెళ్లే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ఇందిరాపార్కు వద్దకు ర్యాలీగా బయలుదేరిన ఆయా పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.

English summary

 Hyderabad city has been wrapped in an unprecedented security blanket in view of the Chalo Assembly march planned by the Telangana Political JAC on Friday despite the authorities not according it permission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X