వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెమ్మెస్‌తో యువతికి వేధింపు, లీడర్‌పై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Man murdered by wife and two brothers
బెంగళూరు/లక్నో: ఇరవై ఏళ్ల ఓ యువతిని లైంగికంగా వేధించినందుకు ఓ రాజకీయ నాయకుడితో పాటు మరో ముగ్గురి పైన పోలీసు కేసు నమోదయింది. జిల్లా కార్యదర్శిగా ఉన్న ఆ పార్టీ నాయకుడు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇస్తూ.. ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

యువతిని వేధిస్తున్నందుకు పోలీసులు విశాళ్, వీరేంద్ర, లడ్డూ, సతీష్‌ల పైన కేసును నమోదు చేశారు. నిందితులు అమ్మాయిని ఎమ్మెస్ ద్వారా చిత్రీకరించినట్లుగా కూడా పోలీసులు చెబుతున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నగర పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసును విచారిస్తున్నారు.

బెంగళూరులో భర్తను చంపిన భార్య

కర్నాటక రాజధాని బెంగళూరులో ముప్పై ఏళ్ల ఓ వ్యక్తిని ఆయన భార్య, తన సోదరుల సహాయంతో ఐరన్ రాడ్‌తో కొట్టి చంపింది. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. మృతుడిని సాగర్‌గా గుర్తించారు. అతని భార్య అనిత. అనితకు ఇద్దరు సోదరులు ఉన్నారు. సాగర్, అనితలు ఇద్దరు నేపాల్‌కు చెందిన వారు.

వారికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారికి పడకపోవడంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం అనిత వరకట్న వేధింపులంటూ భర్త పైన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తాము వేర్వేరుగా ఉంటున్నప్పటికీ నిత్యం భర్త తన ఇంటికి వచ్చి డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. ఈ కేసు కొనసాగుతోంది.

సమాచారం మేరకు బుధవారం రాత్రి పదకొండు గంటలకు సాగర్.. అనిత ఇంటికి వెళ్లాడు. డబ్బుల కోసం డిమాండ్ చేశాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనిత సోదరులు జోక్యం చేసుకున్నారు. ఇరువురి మధ్య గొడవ పెరగడంతో సాగర్ పైన వారు ఇనుప రాడుతో దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు.

English summary
A Nepali man was allegedly stabbed several times and beaten with an iron rod to death by his wife and her two younger brothers over a family dispute in Whitefield police limits on Wednesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X