ఎమ్మెల్యేల్నికొంటున్నారని బిజెపి, బాధిస్తున్నారని నితీష్

మరోవైపు నితీష్ కుమార్ కూడా బిజెపిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిజెపి తనకు ఇబ్బందులు కలిగిస్తోందని అన్నారు. తనకు ఓ వైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. తమను మట్టుబెట్టే మందులిస్తున్నారని ఆరోపించారు. బిజెపి పార్టీ ఆహ్వానం బాగుందని, వ్యవహార శైలి మాత్రం బాధిస్తోందన్నారు. బిజెపి, జెడియు మధ్య సంబంధాలు సరిగాలేవని దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
బిహార్ బిజెపి నేతలు జెడియుతో తెగతెంపులకే సిద్ధపడుతున్నారు. వారు ఎప్పటి నుండో అధిష్టానాన్ని తెగతెంపులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచార సారథిగా ఎన్నికవడం జెడియుకు ఇష్టం లేకపోవడంతో బిహార్ బిజెపి నేతలు అధిష్టానానికి మరోసారి తెగతెంపుల అంశంపై చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
మోడీ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేదని, పదమూడేళ్లుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారని, అంతకుముందు మోడీపై అభ్యంతరం లేనప్పుడు 2010 నుండే ఎందుకు శత్రుత్వం పెరిగిందని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రధాని అభ్యర్థిని రెండు రోజుల్లో తేల్చాలని జెడియు.. బిజెపికి డెడ్ లైన్ విధించిందనే ప్రచారం సాగుతుండగా.. అలాంటిదేమీ లేదని జెడియు అధినేత శరద్ యాదవ్ చెబుతున్నారు. కాగా రేపు జెడియు సమావేశం కానుంది. ఎన్డీయేలో కొనసాగుతారా లేదా రేపు తెలియనుంది.












Click it and Unblock the Notifications