జగన్ పార్టీ టికెట్ కూడా రాదు: డిఎల్‌పై వీరశివా

Veerasiva Reddy
హైదరాబాద్: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన తమ పార్టీ శానససభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డిపై కాంగ్రెసు కడప జిల్లా శానససభ్యుడు వీరశివా రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. డిఎల్ రవీంద్రా రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిఎల్ రవీంద్రా రెడ్డికి కాంగ్రెసు టికెట్ రాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిఎల్ రవీంద్రా రెడ్డికి టికెట్ ఇవ్వడానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా సిద్ధంగా లేవని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించకపోతే డిఎల్ రవీంద్రా రెడ్డి కాంగ్రెసు నుంచి వెళ్లిపోవచ్చునని ఆయన అన్నారు. చలో అసెంబ్లీ విషయంలో కిరణ్ కమార్ రెడ్డి ప్రభుత్వానికి అప్రతిష్ట రావాలని డిఎల్ రవీంద్రా రెడ్డి కోరుకున్నారని ఆయన అన్నారు. అది జరగకపోగా, కాంగ్రెసు అధిష్టానం పెద్దలు మెచ్చుకోవడంతో డిఎల్‌కు కడుపు మండిందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రికి మంచి పేరు రావడాన్ని డిఎల్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. అధిష్టానం ముఖ్యమంత్రిని అధిష్టానం మెచ్చుకుంటే డిఎల్‌కు ఇబ్బందా అని ఆయన అన్నారు. అనుమతి లేకుండా లక్షల మంది వస్తే చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని అడిగారు. తుపాకులు పేలుతాయని, గందరగోళం అవుతుందని డిఎల్ ఆశించారని ఆయన అన్నారు.

డిఎల్ రవీంద్రారెడ్డి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని ఆయన ఆరోపించారు. డిఎల్ ఓఎస్‌డిపై ఎసిబి విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత డిఎల్ జైలుకు వెళ్లక తప్పదని ఆయన అన్నారు. ఈ కేసులో డిఎల్ అవినీతి బయటపడుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+