ఉస్మానియాలో చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

శ్రీనివాస్ మృతదేహాన్ని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ శనివారంనాడు సందర్శించారు. ఆయనతో పాటు తెలంగాణ ఎన్జీవోల నాయకుడు శ్రీనివాస గౌడ్, బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కారు కాలిపోయి వ్యక్తి మృతి
హైదరాబాదులోని పివి నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వేపై పిల్లర్ నెంబర్ 179 వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు కాలి కాలిపోయింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. అతన్ని సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. కారులో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, కాలిన కారును హైదరాబాదులోని అమీర్‌పేటకు చెందిన సంతోష్ కుమార్ అగర్వాల్‌దని పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్‌లోని కటేదాన్‌లో గల తన కంపెనీ నుంచి అతను ఇంటికి వస్తుండగా ప్రమాదం సంభవించింది.
వైద్య విద్యార్థి ఆత్మహత్య
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా చినకాకానిలోని ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో విద్యార్థి వంశీకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మృతుని కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు పరామర్శించారు.












Click it and Unblock the Notifications