చలో అసెంబ్లీపై సుదర్శన్ X రాపోలు, తుది సమరమే

ఈ సందర్భంగా మంత్రి శాఖ సుదర్శన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చలో అసెంబ్లీ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై రాపోలు, సుదర్శన్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. చలో అసెంబ్లీ సందర్బంగా ఇనుపగోడలు కట్టారని, తెలంగాణవాదుల రక్తాన్ని చిందించారని, ఇదేనా ప్రజాస్వామ్యమని రాపోలు ప్రశ్నించారు. దానికి సుదర్శన్ ధీటుగా స్పందించారు.
నిరసనరారులు అసెంబ్లీలోకి జొరపడేలా ఉంటే ప్రభుత్వం చూస్తు ఎలా ఊరుకుంటుందని, చలో అసెంబ్లీకి తెరాస పిలుపునిస్తే మీరెందుకు బాధ్యత తీసుకుంటున్నారని, తెలంగాణ ఏర్పాటుతో పాటు ప్రభుత్వం, పార్టీ ప్రయోజనాలు కూడా ముఖ్యమని ఆయన ధీటుగా స్పందించారు. ఇరువురి మధ్య వాదన పెరుగుతుండటంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి కలుగజేసుకొని వారిని సముదాయించారు. రాపోలుకు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా మద్దతు పలికారు.
కాగా, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తాము ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉందని, దానిని తొలగించేందుకు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ మంత్రులు, ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ సమావేశానికి సంబంధించి సమాచారం మంత్రి డికె అరుణకు మాత్రం చేరలేదట.












Click it and Unblock the Notifications