ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాఠశాలకు బాంబు బెదిరింపు, దున్నపోతుపై కాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bomb threat call to school
హైదరాబాద్/ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచ మండలంలో పోలీసులు దున్నపోతుపై కాల్పులు జరిపారు. మంగళవారం ఉదయం ఓ దున్నపోతు మండలంలోని నాగారం గ్రామంలో బీభత్సం సృష్టించింది. అందరినీ పొడుస్తూ ఓ వ్యక్తి మృతికి కారణమైంది. ఇది తెలిసిన పోలీసులు దున్నపోతుపై కాల్పులు జరిపారు.

బాంబు బెదిరింపు

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎన్ఆర్‌డిజి పాఠశాలలో బాంబు పెట్టినట్లుగా ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బయటకు పంపించి పోలీసులకు సమాచారం అందించింది. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని బాంబు స్క్వాడ్ నిర్ధారించింది. స్కూల్‌కు ఫేక్ కాల్ వచ్చిందని పోలీసులు తేల్చి చెప్పారు.

రైలులో వ్యక్తి ఆత్మహత్య

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జమ్ముతావి-చెన్నై మధ్య నడిచే ఎక్సుప్రెస్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలులోని ఎస్ 3 బోగిలో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందాడు. సూళ్లూరుపేటలో ఆ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించింది. రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఆత్మహత్య

వరంగల్ జిల్లా దేవరప్పుల మండలం కోలుకొంలో నిప్పంటించుకొని ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో తల్లీ కొడుకు మృతి చెందారు. కూతురు పరిస్థితి విషమంగా ఉంది.

తగలబడిన డీజిల్ ట్యాంకర్

హైదరాబాదులోని శామీర్‌పేటలో ఓ డీజిల్ ట్యాంకర్ నడిరోడ్డు పైన తగులబడుతోంది. డీజిల్ ట్యాంక్ తగులబడుతుంటడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

English summary
A school in Dilsukhnagar, Hyderabad received a bomb threat phone call and this resulted in tension in this area. Bomb diffusal squad arrived and searched the place thoroughly and found it was a hoax call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X